తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేరు: వరుణ్‌ సందేశ్‌ | Varun Sandesh about nindha movie | Sakshi
Sakshi News home page

తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేరు: వరుణ్‌ సందేశ్‌

Jun 19 2024 12:24 AM | Updated on Jun 19 2024 12:24 AM

Varun Sandesh about nindha movie

‘‘నింద’ చిత్రంలోని నా పాత్రకి, నిజ జీవితంలోని నాకు అస్సలు పోలిక ఉండదు. నేను సరదాగా ఉంటాను. సీరి యస్‌గా ఉండను. ‘నింద’లో నా మనస్తత్వానికి భిన్నమైన పాత్ర చేశాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను’’ అని వరుణ్‌ సందేశ్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘నింద’. రాజేశ్‌ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం వరుణ్‌ సందేశ్‌ మీడియాతో పంచుకున్న విశేషాలు.

⇒ నా కెరీర్‌లో ఒకే తరహా సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. దీంతో సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుని యూఎస్‌ వెళ్లాను. అక్కడ రాజేశ్‌గారు ‘నింద’ కథ చెప్పారు. నచ్చడంతో ఈ సినిమా చేశాను. ‘కానిస్టేబుల్‌’ సినిమా షూటింగ్‌లో నా కాలికి గాయమైంది. అయితే రాజేశ్‌గారి డెడికేషన్‌ చూసి రిస్క్‌ చేసి ఆ గాయంతోనే ‘నింద’ షూటింగ్‌లో పాల్గొన్నాను. 

⇒సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌ జానర్‌లో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘నింద’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నటీనటుల్లో ఎవరికీ ఈ మూవీ పూర్తి కథను చెప్పలేదు రాజేశ్‌గారు. దీంతో ఆర్టిస్టుల్లోనూ ఈ సినిమాపై ఓ క్యూరియాసిటీ పెరిగింది. కథ పరంగా అసలు నేరస్థుడు ఎవరనే విషయాన్ని నేను కూడా చెప్పలేకపోయాను. 

⇒మా దర్శక–నిర్మాత రాజేశ్‌గారి ఫ్రెండ్‌ అమెరికాలో ‘నింద’ని రిలీజ్‌ చేస్తున్నారు. ఆయన మైత్రీ మూవీస్‌ నవీన్‌గారికి తెలుసు. అలా మైత్రీ శశిగారు మా సినిమా చూడటం, నచ్చడంతో నైజాంలో విడుదల చేస్తున్నారు. ‘నింద’ తర్వాత ఓ క్రేజీ ్రపాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. అలాగే ‘కానిస్టేబుల్‌’ అనే సినిమాలో నటిస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement