హీరోకి, దర్శకుడికి కరోనా : నిలిచిపోయిన షూటింగ్‌ | Varun Dhawan Neetu and director Raj Mehta positive for COVID-19 | Sakshi
Sakshi News home page

హీరోకి, దర్శకుడికి కరోనా : నిలిచిపోయిన షూటింగ్‌

Dec 4 2020 1:43 PM | Updated on Dec 4 2020 2:25 PM

Varun Dhawan Neetu and director Raj Mehta positive for COVID-19 - Sakshi

బాలీవుడ్‌ హీరో వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న జగ్ జగ్ జీయో మూవీ బృందానికి కరోనా షాక్‌ తగిలింది

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ హీరో వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న జగ్ జగ్ జీయో మూవీ  బృందానికి కరోనా షాక్‌ తగిలింది.  తాజా నివేదికల ప్రకారం, వరుణ్ ధావన్, నీతూకపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు  కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  చండీగఢ్‌లో షూటింగ్‌లో ఉండగా వీరికి సోకినట్టు సమాచారం.  అయితే కరోనా నిర్ధారిత పరీక్షల్లో సీనియర్‌ హీరో అనిల్‌ కపూర్‌కు నెగిటివ్‌ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో షూట్ ఆగిపోయిందని ఫిలింఫేర్ ఒక నివేదికలో పేర్కొంది. వరుణ్, నీతు, దర్శకుడు రాజ్ కోలుకునేం‍తవరకు గత నెలలో ప్రారంభమైన షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్టు తెలిపింది. అయితే  సినిమా ముచ్చట్లను ఎప్పటికపుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటున్న  చిత్రయూనిట్‌గానీ, నీతూ, వరుణ్‌, అనిల్‌ కపూర్‌గానీ ఈ వార్తలపై ఇంకా స్పందించ లేదు.

కాగా దివంగత బాలీవుడ్‌ సీనియర్‌ హీరో రిషి కపూర్‌  మరణం తరువాత నీతు కపూర్ మళ్లీ నటిస్తున్నారు. ఈ విషయాన్ని నీతూ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అంతకు ముందు  మహమ్మారి సమయంలో తొలిసారి విమానం ఎక్కుతున్నా..కొంచెం టెన్షన్‌గా ఉందంటూ పోస్ట్‌ చేశారు. ఈ సందర్బంగా ‘‘ కపూర్‌ సార్‌ నా చేయి పట్టుకుని ధైర్యం చెప్పడానికి మీరిక్కిడ లేరు...అయినా నిత్యం నాతోనే ’’ అంటూ  నీతూ తన భర్త రిషీకపూర్‌ను గుర్తు చేసుకున్నారు. అలాగే నీతూ కపూర్‌ కరోనా టెస్టులు చేయించుకున్న వీడియో వైరల్‌ అయింది. కాగా 2021లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మనీష్ పాల్ ప్రజక్త కోలి కూడా నటిస్తున్నారు. కరణ్ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి : వ్యాక్సిన్‌: ఒబామా, బుష్‌, క్లింటన్‌ సంచలన నిర్ణయం)

Advertisement
 
Advertisement
Advertisement