డ్రగ్స్‌ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు | Varalaxmi Sarathkumar Faced Drugs Case Notice From Kochi NIA In Her PA Case - Sakshi
Sakshi News home page

Varalaxmi Sarathkumar Drugs Case: డ్రగ్స్‌ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు

Aug 29 2023 2:40 PM | Updated on Aug 29 2023 6:05 PM

Varalaxmi Sarathkumar Faced Drugs Case Notice - Sakshi

శరత్‌కుమార్‌ కుమార్తెగా సినీ పరిశ్రమకు పరిచయమైంది వరలక్ష్మీ శరత్‌కుమార్. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో నటిస్తూ బిజీ అర్టిస్టుగా మారిపోయింది. ఇలా సౌత్‌ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు డ్రగ్స్‌ కేసుకు సంబంధించి కొచ్చి ఎన్ఐఏ అధికారుల నోటీసులు జారీ చేశారు.

(ఇదీ చదవండి: ‘ఖుషి’ రెమ్యునరేషన్‌.. మా అమ్మే ఆశ్చర్యపోయింది: డైరెక్టర్‌)

చాలు ఏళ్లుగా వరలక్ష్మి దగ్గర పీఏగా పనిచేస్తున్న ఆదిలింగం అనే వ్యక్తి  డ్రగ్స్ కేసులో కీలక నిందితులలో ఒకరిగా చెలామణి అవుతున్నట్లు కొచ్చి పోలీసులు గుర్తించారు. ఆయనకు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పక్కా ఆధారాలు పోలీసులకు లభించాయి. దీంతో ఆదిలింగంను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. 

డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో  అదిలింగంనకు  సంబంధించిన పూర్తి వివరాల కోసం సినీ నటి వరలక్ష్మిని విచారించడానికి ఎన్ఐఏ అధికారులు సమన్లు జారీచేశారు. వరలక్ష్మికి పీఏగా పనిచేసిన అదిలింగం గతంలో అనేకసార్లు ఆమెకి డ్రగ్స్ ఇచ్చినట్టుగా ఎన్ఐఏ అనుమానిస్తుంది.

అంతేకాకుండా డ్రగ్స్ అమ్మిన ద్వారా వచ్చిన డబ్బును సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు ఆమె సహకరించారనే కోణంలో అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా కోలీవుడ్‌లో ఎవరెవరితో ఆదిలింగం టచ్‌లో ఉన్నారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఇలా ఆయనకు సంబంధించిన అనేక విషయాలపై పూర్తిస్థాయిలో సమాచారం రాబట్టడం కోసమే వరలక్ష్మి శరత్ కుమార్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో కోలీవుడ్‌ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టాలీవుడ్‌కు సంబంధించి ఎవరైనా ఈ డ్రగ్స్‌ గ్యాంగ్‌తో టచ్‌లో ఉన్నారేమోననే కోణంలో కూడా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement