Vakkantham Vamsi: Jr NTR Was First Choice Of Naa Peru Surya Na Illu India - Sakshi
Sakshi News home page

Vakkantham Vamsi: నా పేరు సూర్య.. సినిమాకు ఫస్ట్‌ చాయిస్‌ బన్నీ కాదు

Published Thu, Nov 17 2022 3:43 PM | Last Updated on Thu, Nov 17 2022 4:47 PM

Vakkantham Vamsi: Jr NTR Was First Choice Of Naa Peru Surya Na Illu India - Sakshi

అల్లు అర్జున్‌ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు మొదటగా జూనియర్‌ ఎన్టీఆర్‌నే హీరోగా అనుకున్నట్లు తెలిపాడు. తారక్‌తో ఆ సినిమా చేయాల్సిందని,

సినీ రచయితగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వక్కంతం వంశీ. టాలీవుడ్‌కు ఎన్నో హిట్‌ సినిమాలు అందించిన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా కిక్‌ అని చెప్పాడు. ఓసారి టెంపర్‌ ఐడియా తారక్‌కు చెప్పగా.. దానికి నేను సూటవుతానా? అని అతడు అడిగాడు.. అలా జూనియర్‌ ఎన్టీఆర్‌తో టెంపర్‌ చేశానని పేర్కొన్నాడు.

అల్లు అర్జున్‌ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు మొదటగా జూనియర్‌ ఎన్టీఆర్‌నే హీరోగా అనుకున్నట్లు తెలిపాడు. తారక్‌తో ఆ సినిమా చేయాల్సిందని, ఆయనే తనను దర్శకుడిని చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది బన్నీ చేతిలోకి వెళ్లిందన్నాడు. ఇకపోతే ప్రస్తుతం అతడు ఏజెంట్‌ సినిమాకు రైటర్‌గా పని చేస్తుండగా ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.

చదవండి: అది మాటల్లో చెప్పలేను: గౌతమ్‌ ఘట్టమనేని
టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న మాజీ ప్రపంచ సుందరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement