Manushi Chillar Tollywood entry with Varun Tej in his next movie - Sakshi
Sakshi News home page

Manushi Chhillar: టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న మాజీ ప్రపంచ సుందరి! ఆ మెగా హీరోకి జోడిగా..

Nov 17 2022 9:43 AM | Updated on Nov 17 2022 10:31 AM

Manushi Chhillar Entry into Tollywood With Varun Tej Movie - Sakshi

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్ల‌ర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. మెగా హీరోతో ఆమె జోడికట్టబోతున్నట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్‌ వ‌రుణ్‌తేజ్ హీరోగా ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను జ‌రుపుకుంటోంది. ఇందులో జెట్ పైలెట్‌గా వ‌రుణ్‌తేజ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్‌కు జోడీగా మిస్ ఇండియా మానుషి చిల్లార్ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 2017లో మిస్ ఇండియాతో పాటు మిస్ వ‌ర‌ల్ట్ టైటిల్స్‌ను మానుషి చిల్లార్ సొంతం చేసుకున్న‌ది. అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన చారిత్ర‌క చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాణి సంయోగిత పాత్ర‌లో మానుషి చిల్లర్ నటనకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement