
బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు ఉర్ఫీ జావెద్. వింత వింత దస్తులు ధరించి సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫేమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతలా ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ బ్యూటీకి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మన జీవితంలో ఇలాంటి వాటికి కుంగి పోవాల్సిన అవసరం లేదని తెలిపింది. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే షేర్ చేయండి అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం పదండి.
ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. అందులో భాగంగానే వీసాకు కూడా దరఖాస్తు చేసింది. కానీ ఊహించని విధంగా ఉర్ఫీ జావెద్ వీసాను అధికారులు తిరస్కరించారు. ఈ విషయం తెలుసుకున్న బ్యూటీ తాను, తన టీమ్ చాలా నిరాశకు గురయ్యామని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. నా లైఫ్‌తో వ్యాపారంలోనూ ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఉర్ఫీ తెలిపింది. ఇలాంటి వాటితో బాధపడకుండా మరింత స్ట్రాంగ్‌గా ముందడుగు వేయాలని చెబుతోంది. మీలో ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే షేర్ చేసుకుని ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని అంటోంది.
(ఇది చదవండి: కాపీ కొట్టావ్.. చిలుక బ్యాగ్, ఊర్వశీ రౌతేలా లుక్‌పై ట్రోలింగ్!)
ఉర్ఫీ తన పోస్ట్‌లో రాస్తూ..'నాకు కేన్స్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. కానీ విధిరాతతో నా వీసా తిరస్కరణకు గురైంది. కొన్ని డిఫరెంట్ దుస్తులను ప్రదర్శించాలని ఆలోచించాం. వీసా రిజెక్ట్ కావడంతో నేను, నా బృందం చాలా నిరుత్సాహపడ్డాము. మీలో చాలా మంది తిరస్కరణలను స్వయంగా ఎదుర్కొని ఉంటారు. అలాంటి వారి స్టోరీలను కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. తిరస్కరణల తర్వాత దాని గురించి నిరాశ చెందడం, ఏడవడం సాధారణం. నిజానికి మనకు ఆరోగ్యకరమైంది కూడా. నేను కూడా ఏడుస్తాను.. కానీ తర్వాత ఏం జరుగుతుంది? మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతి తిరస్కరణ మనకు ఒక అవకాశం. జీవితంలో చాలా రిజెక్షన్స్ తర్వాత కూడా నేను ఎక్కడా ఆగిపోలేదు. మీరు కూడా అలాగే ఉండండి' అంటూ మోటివేషనల్ పోస్ట్ చేసింది. కాగా.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 24 వరకు జరగనుంది.