మోస్ట్ వయొలెంట్‌ చిత్రానికి సీక్వెల్‌.. సారీ చెప్పిన ఉన్ని ముకుందన్‌! | Unni Mukundan Responds On Marco Movie Sequel | Sakshi
Sakshi News home page

Unni Mukundan: మార్కో సీక్వెల్‌.. ఆ కారణంతోనే తప్పుకుంటున్నా!

Jun 15 2025 3:41 PM | Updated on Jun 15 2025 4:02 PM

Unni Mukundan Responds On Marco Movie Sequel

మలయాళ స్టార్‌ ఉన్ని ముకుందన్‌ గతేడాది మార్కో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోస్ట్‌ వయొలెంట్‌గా టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా కూడా ఉంటుందని అభిమానులు భావించారు. దీంతో ఓ అభిమాని సైతం మార్కో-2 ఎప్పుడొస్తుందని ట్విటర్ వేదికగా హీరోను ‍ప్రశ్నించాడు.

దీనికి ఉన్ని ముకుందన్‌ కూడా రిప్లై ఇచ్చారు. ఈ విషయంలో క్షమించండి.. మార్కో సిరీస్‌ను కొనసాగించాలనే ఉద్దేశాన్ని విరమించుకున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌పై ఎక్కువగా నెగెటివిటీ ఉంది.. అయితే మార్కో కంటే మంచి సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా.. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. దీంతో మార్కో సీక్వెల్‌ వస్తుందని భావిస్తోన్న అభిమానులకు నిరాశ ఎదురైంది.

కాగా..2024 డిసెంబర్‌లో విడుదలైన ‘మార్కో చిత్రంలో వయొలెన్స్‌ విపరీతంగా ఉన్నట్లు టాక్ వినిపించింది. దీంతో కొందరు మార్కో చిత్రంపై విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.  హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన మార్కోను రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాగా.. తెలుగు వెర్షన్ జనవరి 1న, తమిళ వెర్షన్ జనవరి 3న థియేటర్లలోకి వచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement