Kundali Bhagya Actress Mansi Srivastava To Tie Knot With Kapil Tejwani: హిందీ సీరియల్ 'కుండలి భాగ్య'తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైన మాన్సీ శ్రీవాస్తవ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రియుడు, ఫుడ్ అండ్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ కపిల్ తేజ్వానీతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతోంది. ఈ మేరకు ఓ వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ కథనాల ప్రకారం.. మాన్సీ, కపిల్ కొన్నేళ్ల క్రితం ఓ యాడ్ షూటింగ్‌లో కలిశారు. కానీ ఆ తర్వాత వాళ్లిద్దరూ మాట్లాడుకుందీ, కలిసిందీ లేదు. అయితే ఏడేళ్ల తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు.

అలా 2019లో వీరి ప్రేమాయణం మొదలైంది. తొలిచూపులోనే ప్రేమలో పడలేదని, పలుసార్లు కలిసాకే, ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే ప్రేమలో మునిగిపోయారట! వీరి స్నేహం ప్రేమగా మారి, ఇప్పుడా ప్రేమ పెళ్లివరకూ వచ్చిందన్నమాట! పెళ్లి ఎప్పుడు? ఎక్కడ చేసుకోవాలి? అని ప్లానింగ్ మొదలు పెట్టిన మాన్సీ వచ్చే ఏడాది జనవరిలో అదీ ముంబైలో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉందట! కాగా మాన్సీ ఆగస్టు నెలలో 'కుండలీ భాగ్య' సీరియల్‌లో భాగమయ్యింది. ఈ మధ్యే సీరియల్‌లో జాయిన్ అయినప్పటికీ తన పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని మురిసిపోయిందీ నటి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
