సీఎంగా విజయ్‌.. 12 ఏళ్ల తర్వాత త్రిషకు కలిసిరానుందా? | Trisha Long Pending Thriller Movie Sathuranga Vettai 2 Releasing After 12 Years Of Shooting, Check Update Inside | Sakshi
Sakshi News home page

Trisha: 12 ఏళ్ల తర్వాత త్రిష మూవీకి మోక్షం.. అంతా విజయ్ వల్లేనా?

Jun 16 2026 1:43 PM | Updated on Jun 16 2026 2:05 PM

Trisha Movie Sathuranga Vettai 2 releasing After 12 years of shooting

ఏదైనా కొత్త సినిమాలు ఏడాదికో, రెండేళ్లలోనే థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. స్టార్ హీరోల విషయానికొస్తే అది కాస్తా మూడు నుంచి నాలుగేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. పెద్ద పెద్ది భారీ బడ్జెట్ మూవీస్ సైతం అనుకున్న టైమ్‌లోనే విడుదలైన సందర్భాలే ఎక్కువ. కానీ షూటింగ్ పూర్తై ఐదు నుంచి పదేళ్లయినా కూడా రిలీజ్‌ కానీ చిత్రాలు రిలీజ్‌కు నోచుకోలేదంటే చాలా కారణాలే ఉండొచ్చు. ఈ జాబితాలో విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం దాదాపు 8 ఏళ్లవుతున్న విడుదల కావడం లేదు. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఇటీవలే గౌతమ్ వాసుదేవ్ మీనన్ రిలీజ్‌కు మరో నెల రోజుల సమయం కోరాడు.

మరి ఒక సినిమా విడుదలకు ఇదే చాలా లాంగ్‌ గ్యాప్‌ అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ అంతకు మించి రిలీజ్‌ కాకుండా ఆగిపోయిన మూవీ కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? అది కూడా స్టార్ హీరోయిన్ నటించిన చిత్రం కావడం మరో విశేషం. ఇంతకీ ఆమె ఎవరు? ఏ సినిమా అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి మీకే తెలుస్తుంది.

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇటీవల రాజకీయ కారణాలతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అయితే గతంలో ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ శతురంగ వట్టై-2 ఇప్పటి వరకు విడుదల కాలేదు. 2014లోనే షూటింగ్ పూర్తయినప్పటికీ ఆర్థిక సమస్యల వివాదంతో రిలీజ్‌ కాకుండా ఆగిపోయింది. ఈ చిత్రంలో అరవింద్‌స్వామి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఆర్‌వీ నిర్మల్‌కుమార్‌ దర్శకత్వం వహించగా.. హెచ్‌ వినోద్‌ కథ అందించారు.

అయితే తాజాగా ఈ మూవీ ఏకంగా 12 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం త్రిషకు తమిళనాట ఉన్న క్రేజ్‌తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. విజయ్ సీఎం అయ్యాక ఆమె క్రేజ్ అమాంతం పెరగడంతో ఇప్పుడైతే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆమెకున్న ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో చిత్రీకరణ పూర్తయిన తర్వాత పుష్కర కాలానికి త్రిష మూవీ రిలీజ్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని అడ్డంకులను అధిగమించి  త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తాజా సమాచారం. అతి త్వరలోనే రిలీజ్ డేట్‌ కూడా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement