నా లుక్‌ కొత్తగా ఉంటుంది: సత్యరాజ్‌ | Toofan Pre Release Event | Sakshi
Sakshi News home page

నా లుక్‌ కొత్తగా ఉంటుంది: సత్యరాజ్‌

Jul 28 2024 6:08 AM | Updated on Jul 28 2024 6:08 AM

Toofan Pre Release Event

‘‘బాహుబలి’ తర్వాత సినిమాల రేంజ్‌ పెరిగింది. తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘తుఫాన్‌’ సినిమాతో వారికి మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నాను’’ అని విజయ్‌ ఆంటోనీ అన్నారు. విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం ‘తుఫాన్‌’. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో కమల్‌ బోరా, డి. లలిత, బి. ప్రదీప్, పంకజ్‌ బోరా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘తుఫాన్‌’ కంటెంట్, క్వాలిటీ మాకు సక్సెస్‌ ఇస్తాయన్న నమ్మకం ఉంది. నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. వారికి థ్యాంక్స్‌’’ అన్నారు.

‘‘నాకు నచ్చిన థ్రిల్లర్‌ మూవీ ‘తుఫాన్‌’. ఈ సినిమాలో నా లుక్, మేకోవర్, క్యారెక్టర్‌ కొత్తగా ఉంటాయి’’ అన్నారు సత్యరాజ్‌. ‘‘తుఫాన్‌’ను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు విజయ్‌ మిల్టన్‌. ‘‘తుఫాన్‌’లో క్వాలిటీ కంటెంట్, కమర్షియల్‌ అంశాలు ఉన్నాయి’’ అన్నారు ధనుంజయ.

Advertisement
 
Advertisement
Advertisement