
టాలీవుడ్‌లో సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న లిప్సిక.. శుభవార్త చెప్పేసింది. తాను కూతురికి జన్మనిచ్చిన విషయాన్ని బయటపెట్టింది. ఊయల వేడుకని ఘనంగా చేసుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. తోటి సింగర్స్, నెటిజన్లు ఈమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ వేడుకకు వచ్చిన కీరవాణి.. పాపని ఆశీర్వదించారు.
(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్.. అప్పు చేసి రూ.4.75 కోట్లు తిరిగిచ్చా: హీరో సిద్ధు)
ఎంబీఏ చేసిన లిప్సిక.. చిన్నతనంలోనే పలు షోల్లో పాల్గొంది. గాయనిగా కెరీర్ ప్రారంభించింది. ఎక్స్‌ప్రెస్ రాజా, ప్రేమకథా చిత్రమ్, బింబిసార, టెంపర్, బాహుబలి తదితర చిత్రాల్లో పాటలు పాడింది. ఓవైపు గాయనిగా గుర్తింపు తెచ్చుకుంటూనే మరోవైపు పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెబుతోంది. 'మేం వయసుకు వచ్చాం' మూవీతో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. హెబ్బా పటేల్, మెహరీన్, మేఘా ఆకాశ్ తదితర హీరోయిన్లకు ఈమెనే వాయిస్ ఇచ్చింది.

2012లో ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పుడప్పుడు భర్తతో తీసుకున్న ఫొటోలు పోస్ట్ చేసే లిపిక్స.. ఇప్పుడు తనకు కూతురు పుట్టిన విషయాన్ని రివీల్ చేసింది. ఈ కార్యక్రమానికి కీరవాణి వచ్చారు. ఈయన దగ్గర చాన్నాళ్ల నుంచి లిప్సిక.. శిష్యరికం చేస్తోంది. ఈయన ఆశీర్వదించిన విజువల్స్ కూడా వీడియోలో ఉన్నాయి. అలానే బిగ్‌బాస్ ఫేమ్ వితికా షేరు కూడా లిప్సిక కూతురి ఊయల వేడుకకు వచ్చింది.
(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))