breaking news
Lipsika Bhashyam
-
ప్రవస్తి కాంట్రవర్సీపై స్పందించిన లిప్సిక ..!
-
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
'పాడుతా తీయగా' పాటల ప్రోగ్రామ్ పై వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ షో నుంచి తాజాగా ఎలిమినేట్ అయిన ప్రవస్తి ఆరాధ్య అనే గాయని.. జడ్జిలైన కీరవాణి, సునీత, చంద్రబోస్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనని కావాలని ఇబ్బంది పెట్టారని, టార్గెట్ చేసి మరీ ఎలిమినేట్ చేశారని చెప్పుకొచ్చింది. తనపై బాడీ షేమింగ్ కూడా జరిగిందని చెప్పి షాకిచ్చింది. ఇప్పుడు ఈమె ఆరోపణలపై మరో సింగర్ లిప్సిక కౌంటర్ ఇచ్చింది. ఇన్ స్టాలో పెద్ద వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్)లిప్సిక ఏం చెప్పిందంటే?'ప్రవస్తి.. పాడుతా తీయగా షోలో తనకు ఏం జరిగిందనే విషయాన్ని చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఎంతమందికి మెచ్యూరిటీ ఉంది. ఆ వీడియోని అర్థం చేసుకోవడానికి. ఏ స్టోరీకైనా రెండు సైడ్స్ ఉంటాయి. అటువైపు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎలా జడ్జ్ చేయగలుగుతాం. తను(ప్రవస్తి) తన భాధని వ్యక్తం చేస్తే.. యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు.. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్?''అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఎవరికైనా సరే అనుభవం ఉండాలి. వచ్చిన కొత్తలోనే ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఎవరున్నారో నాకు తెలీదు. కానీ ఇప్పుడు జడ్జిలుగా ఉన్నవాళ్లు ఒకప్పుడు ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోగలగాలి. అందరూ కష్టపడి పైకి వచ్చినవాళ్లే. ప్రవస్తి ఎవరి పేర్లు అయితే చెప్పిందో వాళ్లు కూడా కష్టపడి పైకొచ్చినవాళ్లే. అలాంటిది వాళ్ల పేర్లు చెప్పడం సరికాదు'(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'కీరవాణి మెప్పు పొందేందుకు నేను 5-6 సంవత్సరాలు కష్టపడ్డా. ఆ తర్వాతే నాకు ఆయన దగ్గర అవకాశం దక్కింది. కీరవాణి దగ్గర చాకిరీ చేయడం సింగర్స్ అందరికీ ఇష్టమే. చాకిరీ అంటే నోట్స్ రాయడం, ప్రాక్టీస్ చేయడం లాంటివి ఉంటాయి' అని లిప్సిక తన వీడియోలు చెప్పుకొచ్చింది.ఈమెతో పాటు మరో లేడీ సింగర్ హారిక నారాయణ్ కూడా ఈ వివాదంపై ఓ వీడియో రిలీజ్ చేసింది. తన అనుమతి లేకుండా ఈ కాంట్రవర్సీలో ఓ న్యూస్ ఛానెల్ లో వీడియో ఒకటి ఉపయోగించారని, అది సరికాదని చెప్పుకొచ్చింది. మరోవైపు ఇదే వివాదంపై సింగర్ సునీత కూడా ఓ వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక) View this post on Instagram A post shared by Lipsika Uday (@lipsikabhashyam) -
సింగర్ లిప్సిక ఇంటి గృహప్రవేశం ఫోటోలు చూశారా?
-
ఘనంగా సింగర్ లిప్సిక గృహప్రవేశం వేడుక.. ఫొటోలు వైరల్
-
సింగర్ లిప్సిక గృహప్రవేశం, ఫోటోలు వైరల్
కుమారి 21 ఎఫ్ చిత్రంతో తన గొంతుతో ప్రేక్షకులకు దగ్గరైన సింగర్ లిప్సిక. గాయనిగానే కాదు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ రాణిస్తోంది. తాజాగా లిప్సిక సొంతింటి కలను సాకారం చేసుకుంది. నూతన గృహంలో పాలు పొంగించింది. గృహప్రవేశాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఈ వేడుకకు బంధుమిత్రులను ఆహ్వానించింది. తన గృహప్రవేశం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. భర్తతో కలిసి ఇంట్లో కుడికాలు పెట్టిన ఫోటోలను, పూజ చేసిన పిక్స్‌ను సైతం షేర్ చేసింది. ఇవి చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక లిప్సిక పాటల విషయానికి వస్తే ఎంబీఏ పూర్తి చేసిన ఆమె గాయనిగా సినీ కెరీర్ ప్రారంభించింది. మేం వయసుకు వచ్చాం సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మారింది. హెబ్బా పటేల్, మెహరీన్, మేఘా ఆకాశ్ వంటి హీరోయిన్స్‌కు డబ్బింగ్ చెప్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Sah Events (@sahevents) చదవండి: అఫీషియల్.. అప్పటినుంచే ఓటీటీలో అందుబాటులోకి వారసుడు