సినిమా ఫ్లాప్.. అప్పు చేసి రూ.4.75 కోట్లు తిరిగిచ్చా: హీరో సిద్ధు | Siddu Jonnalagadda Reacts Jack Movie Failure And Money Return | Sakshi
Sakshi News home page

Siddu Jonnalagadda: డబ్బులు తిరిగిచ్చినందుకు బాధపడట్లేదు కానీ

Sep 26 2025 7:22 PM | Updated on Sep 26 2025 7:32 PM

Siddu Jonnalagadda Reacts Jack Movie Failure And Money Return

సిద్ధు జొన్నలగడ్డ.. ఈ పేరు చెప్పగానే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలే గుర్తొస్తాయి. వీటితో తనకంటూ సెపరేట్ బ్రాండ్ సృష్టించుకున్నాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 'జాక్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా చేసింది. అయితే ఈ చిత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. తొలిరోజే ప్రేక్షకుల నుంచి నిరాదరణకు గురైంది. అయితే ఈ మూవీ ఫ్లాప్ దెబ్బకు హీరో సిద్ధు.. తన రెమ్యునరేషన్ తిరిగేచ్చాశడనే టాక్ వినిపించింది. అయితే అందరూ అవి రూమర్స్ అనుకున్నారు. కానీ అది నిజమేనని ఇప్పుడు సిద్ధు క్లారిటీ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))

ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'తెలుసు కదా'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. దీపావళికి థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. రెండు పాటలు రిలీజ్ చేస్తే రెస్పాన్స్ బాగానే వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడం, గతంలో ఛాన్సుల కోసం వెళ్తే తనకెదురైన అనుభవాల్ని బయటపెట్టాడు. అప్పు చేసి మరీ డబ్బులు తిరిగివ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

'జాక్ సినిమా నిజంగానే ఆడలేదు. ఆ విషయంలో నాకు కూడా బాధ వేసింది. అందుకే రూ.4.75 కోట్లు అప్పు చేసి మరీ తిరిగిచ్చేశాను. ఎందుకంటే ఆ సమయంలో నా చేతిలో డబ్బుల్లేవు. అందుకే అప్పు చేయాల్సి వచ్చింది. ఆ మూవీతో కొందరు నష్టపోయారు. అది నాకు నచ్చలేదు. అందుకే అలా డబ్బులు ఇచ్చేశాను. అయితే డబ్బులు ఇచ్చినందుకు బాధపడట్లేదు. అవి ఇప్పుడు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాను' అని హీరో సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: బికినీ ఫొటోలు.. వెటకారంతో క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement