హెబ్బా పటేల్‌ తాజా చిత్రం.. మంగ్లీ సాంగ్‌ వచ్చేసింది! | Tollywood Movie Dhoom Dhaam Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Dhoom Dhaam Movie: 'మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా'.. లిరికల్ సాంగ్‌ అదిరిపోయింది!

Jun 5 2024 9:26 PM | Updated on Jun 6 2024 9:42 AM

Tollywood Movie Dhoom Dhaam Lyrical Song Out Now

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ధూం ధాం'. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు.  'మల్లెపూల టాక్సీ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, వన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement