అందువల్లే నాకు సినిమా ఛాన్సులు: తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Taapsee Pannu revealed that actress Preity Zinta inspired her to pursue her dreams in the film industry. Sakshi
Sakshi News home page

Taapsee Pannu: ఆమె వల్లే నాకు సినిమా ఆఫర్స్: తాప్సీ

Jun 18 2024 10:00 PM | Updated on Jun 19 2024 8:28 AM

Tollywood Heroine Taapsee Pannu Interesting Comments On Her Chances

ఝమ్మంది నాదం సినిమాలో కెరీర్‌ ప్రారంభించిన ముద్దుగుమ్మ తాప్సీ. ఆ తర్వాత టాలీవుడ్‌లో రవితేజ, మంచుమనోజ్, గోపిచంద్, ప్రభాస్​​ లాంటి హీరోల సరసన మెరిసింది. తెలుగులో చివరిసారిగా మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో కనిపించింది. గతేడాది డంకీ, ధక్‌ ధక్‌ హిందీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తనకు అవకాశాలు రావడానికి గల కారణాలను వెల్లడించింది.

తాప్సీ మాట్లాడుతూ..' తనను నటి ప్రీతీ జింటాకు నేను కొత్త వర్షన్‌గా చాలామంది భావిస్తారు. అందుకే నాకు బాలీవుడ్‌లో ఆఫర్స్‌ వస్తున్నాయి. ఆమె ఎంత పాజిటివ్‌ ఎనర్జీతో ఉంటారో మనందరికీ తెలుసు. తాను బాలీవుడ్‌లో ఉండేందుకు కారణమైన ప్రీతీకి ఎప్పుడూ చెడ్డపేరు తీసుకురాను. ఆమెలానే ప్రేక్షకులను అలరించేందుకు ట్రై చేస్తా. నేను ఆమెను కేవలం బిగ్‌ స్క్రీన్‌పైనే చూశా' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఇటీవలే తాప్సీ తన ప్రియుడు, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా అనే చిత్రంలో కనిపించనున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement