గొప్పమనసు చాటుకున్న టాలీవుడ్ హీరో | Tollywood Hero Sandeep Kishan Helps To A family For medical emergency | Sakshi
Sakshi News home page

Sandeep Kishan: గొప్పమనసు చాటుకున్న సందీప్ కిషన

Sep 2 2024 8:25 AM | Updated on Sep 2 2024 10:50 AM

Tollywood Hero Sandeep Kishan Helps To A family For medical emergency

ఇటీవల రాయన్‌ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన టాలీవుడ్ హీరో సందీప్‌ కిషన్‌. ఓ వ్యక్తి తల్లికి వైద్యపరమైన ఖర్చుల కోసం సాయమందించారు. తన వంతుగా రూ.50 వేలను పంపి గొప్ప మనసు చాటుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన విజ్ఞప్తికి స్పందించిన హీరో వెంటనే ఆర్థికసాయం అందించాడు. ఇది చూసిన సందీప్ కిషన్ ఫ్యాన్స్‌ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. సందీప్‌ ఇప్పటికే ప్రతిరోజూ పేదలకు ఆహారం అందిస్తూ తనవంతుగా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

సినిమాల విషయానికొస్తే ఇటీవల రాయన్ మూవీతో అభిమానులను మెప్పించారు. ధనుశ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ‍అతని తమ్ముడిగా నటించారు. ఈ సినిమాతో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. హీరో ధనుష్‌తో కెప్టెన్‌ మిల్లర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. 

పేదలకు ఉచితంగా ఆహారం..

గతంలో రాయన్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాను నిర్వహిస్తున్న రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆశ్రమాలతో పాటు రోడ్‌ సైడ్‌ ఉండే పేదలకు రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు తెలిపారు. దీంతో నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్‌ తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన  ఉన్నట్లు సందీప్‌ కిషన్‌ తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement