'రాజ్‌ తరుణ్‌కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్'.. లావణ్య షాకింగ్ కామెంట్స్! | Tollywood Hero Raj Tarun Lover Lavanya Shocking Comments On | Sakshi
Sakshi News home page

Lavanya: 'రాజ్‌ తరుణ్‌కు చాలామంది హీరోయిన్స్‌తో రిలేషన్'.. నన్ను వదిలించుకోవాలనే ఇదంతా!

Jul 7 2024 2:49 PM | Updated on Jul 7 2024 3:17 PM

Tollywood Hero Raj Tarun Lover Lavanya Shocking Comments On

రాజ్‌ తరుణ్- లావణ్య టాపిక్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదురుతోంది. హీరోయిన్‌ తామిద్దరం 11 ఏళ్లుగా లివ్ ఇన్‌ రిలేషన్‌లో ఉన్నామని.. ప్రస్తుతం మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నాడంటూ లావణ్య ఆరోపిస్తోంది.  రాజ్ తరుణ్‌కు చాలామంది హీరోయిన్స్‌తో రిలేషన్స్‌ ఉన్నాయంటూ లావణ్య సంచలన కామెంట్స్ చేసింది. 

లావణ్య మాట్లాడుతూ..'నాకు రాజ్‌ తరుణ్‌కు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. దాదాపు 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. ఆమె నన్ను చంపేస్తానని బెదిరించింది. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో ఓ హోటల్‌లో ఉన్నారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.  నేను, రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తాను నన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మస్తాన్‌ సాయికి, నాకు గొడవైంది. అందుకే అతనిపై ఫిర్యాదు చేశా. కొందరు నాతో మైండ్‌గేమ్‌ ఆడారు. ఆ గేమ్‌లో నేను, మస్తాన్ సాయి ఇద్దరం బాధితులమే. డ్రగ్స్‌ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను.' అని అన్నారు.  

ఇంకా మాట్లాడుతూ.. 'నేను, మస్తాన్ సాయి ఎప్పుడు కూడా జంటగా కనిపించలేదు. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లాం. అతను కేవలం నా మ్యూచ్‌వల్‌ ఫ్రెండ్‌. నాతో ఎవరు మాట్లాడినా అతనితో రిలేషన్‌లో ఉన్నట్లేనా? నాకు అన్యాయం జరిగింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా. నా దగ్గర రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్‌ కూడా ఉన్నాయి. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు మొదలయ్యాయి. డబ్బుల కోసం నేను బెదిరించాల్సిన పనిలేదు. అతని కోసం చాలా భరించాను. రాజ్‌ తరుణ్‌కు చాలామంది అమ్మాయిలతో రిలేషన్స్‌ ఉన్నాయి. ' అంటూ షాకింగ్ కామెంట్స్‌ చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement