మొదటి రోజే సినిమా రివ్యూలు.. హీరో నాని రియాక్షన్ ఏంటంటే? | Tollywood Hero Nani Responds On Movie Reviews On First Day | Sakshi
Sakshi News home page

Nani: మొదటి రోజే సినిమా రివ్యూలు.. ఎందుకు ఆగుతారన్న నాని

Apr 22 2025 6:34 PM | Updated on Apr 22 2025 6:50 PM

Tollywood Hero Nani Responds On Movie Reviews On First Day

టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం హిట్-3 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిట్‌ సిరీస్‌లో భాగంగా వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హిట్-3 ట్రైలర్ విడుదల కాగా.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. ఇంతకుముందెన్నడు కనిపించని వయోలెన్స్ పాత్రలో నాని కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు నాని. ఈ సందర్భంగా మూవీ రివ్యూల అంశంపై ఆయన స్పందించారు. విడుదల రోజే రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమాలపై ప్రభావం ఉంటుందని గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాని కామెంట్స్‌పై  

ఈ అంశంపై హీరో నాని మాట్లాడుతూ....' రివ్యూలపై ఎందుకు ఆగాలి? ఎందుకు ఆపాలి.. ఎవర్ని ఆపాలి... ఎలా ఆపాలి... ఇప్పుడు ఎవరినీ ఆపలేరు? నాకు నచ్చలేదు అనండి ఓకే. కానీ ఈ సినిమా ఆడదు అని చెప్పకండి. ఈ మూవీ డిజాస్టర్‌ అని ఒక్కరోజులో ఎలా చెప్తారు. సినిమా విడుదలైనా పది రోజులైనా ఎవరూ చూడకపోతే అప్పుడు పెట్టండి డిజాస్టర్‌ అని. ఫస్డ్‌ డే మార్నింగ్‌ షోకే ఎలా డిసైడ్ చేస్తారు. వ్యక్తిగతంగా సినిమాపై అభిప్రాయం ఎలా వ్యక్తం చేసినా ఓకే. కానీ మీడియా ప్రొఫెషనల్స్ అలా చేయడం కరెక్ట్‌ కాదనేది నా అభిప్రాయం' అని అన్నారు.

కాగా.. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్‌ పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement