సాయిపల్లవికి కొత్త బిరుదు.. చైతూ అంత మాట అనేశాడేంటి? | Tollywood Hero Naga Chaitanya Praises Sai Pallavi Acting In Thandel Movie | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: సాయిపల్లవికి కొత్త బిరుదిచ్చిన నాగచైతన్య.. అదేంటో తెలుసా?

Nov 5 2024 6:47 PM | Updated on Nov 5 2024 6:55 PM

Tollywood Hero Naga Chaitanya Praises Sai Pallavi Acting In Thandel Movie

అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  కార్తికేయ--2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాగ చైతన్య హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించారు. సాయిపల్లవి బాక్సాఫీస్ క్వీన్‌ అంటూ కొనియాడారు. అంతేకాకుండా సినిమాలో కేవలం తన పాత్రకే పరిమితం కాదని.. ప్రతి విషయాన్ని చర్చిస్తుందని నాగచైతన్య తెలిపారు.

నాగచైతన్య మాట్లాడుతూ..' మన బాక్సాఫీస్ క్వీన్ సాయిపల్లవి. ఈ సినిమాలో కేవలం తన క్యారెక్టర్‌ మాత్రమే కాదు.. నా సీన్స్‌ గురించి కూడా చర్చిస్తుంది. అందరి గురించి మాట్లాడుతూ నాకు ఎప్పుడు కూడా ఎంకరేజ్‌గా ఉంటుంది. డ్యాన్స్‌ విషయంలో కూడా సాయిపల్లవితో కష్టమే. ఆమెతో డ్యాన్స్ చేయాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్‌ గురించి వినగానే నాకు చేయాలనిపించింది. తండేల్ చాలా గొప్ప చిత్రం అవుతుంది. నా పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశా' అని అన్నారు.

తండేల్ కథేంటంటే..

నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో  శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జ‌రిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది.  శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాల‌రి   పొర‌పాటుగా పాకిస్థాన్ స‌ముద్ర‌జ‌లాల్లోకి ప్ర‌వేశించాడు. దీంతో పాక్‌ నేవి అధికారులు అరెస్ట్‌ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్‌ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement