అంబానీ పెళ్లికి టాలీవుడ్ ప్రిన్స్.. న్యూ లుక్‌లో సందడి! | Tollywood Hero Mahesh Babu New Look Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Mahesh Babu: అనంత్ అంబానీ పెళ్లికి మహేశ్‌ బాబు ఫ్యామిలీ.. వీడియో వైరల్!

Jul 12 2024 3:27 PM | Updated on Jul 12 2024 4:00 PM

Tollywood Hero Mahesh Babu New Look Goes Viral In Social Media

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ముంబయికి బయలుదేరారు.  అనంత అంబానీ- రాధిక మర్చంట్‌ పెళ్లికి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. తన భార్య నమ్రతా శిరోద్కర్, సితారతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. సరికొత్త హెయిర్‌ స్టైల్‌తో మహేశ్ బాబు లుక్‌ అదిరిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. మహేశ్ బాబు గుంటూరు కారం తర్వాత రాజమౌళితో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement