ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి పాత్ర చేయాలనుకున్నాను: విద్యాబాలన్‌ | Vidya Balan reveals why she missed the MS Subbulakshmi biopic | Sakshi
Sakshi News home page

ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి పాత్ర చేయాలనుకున్నాను: విద్యాబాలన్‌

Oct 17 2026 3:55 AM | Updated on Oct 17 2026 3:56 AM

Vidya Balan reveals why she missed the MS Subbulakshmi biopic

వెండితెరపై ప్రఖ్యాత గాయని ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిగా తాను నటించే అవకాశాన్ని కోల్పోవడం తనను చాలా నిరుత్సాహపరిచిందని విద్యాబాలన్‌ తెలిపారు. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిగా కనిపించేలా విద్యాబాలన్‌ రెండేళ్ల క్రితం ఓ ఫోటోషూట్‌ చేయించుకున్నారు. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి 108వ జయంతి సందర్భంగా ఆ ఫోటోలను సోషల్‌ మీడియా మాధ్యమాల వేదికగా ఆమె షేర్‌ చేశారు కూడా. 

దీంతో ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిగా విద్యాబాలన్‌ నటించనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ ఫోటో షూట్‌ వెనక ఉన్న ఆసక్తకరమైన విషయాలను విద్యా బాలన్‌ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘చిన్నప్పట్నుంచి ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిగారు అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఆమె సుప్రభాతంతో ఆ రోజు మొదలవుతుంది. ఆమె గురించి నాకు కొన్ని విషయాలు కూడా తెలుసు. 2012–2014 మధ్య కాలంలో ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిగారి జీవితంపై రాజీవ్‌ మీనన్‌ (సినిమాటోగ్రాఫర్‌–దర్శకుడు) ఓ స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. కానీ మాకు అనుమతులు లభించని కారణంగా ఈ చిత్రం చేయడానికి మాకు సాధ్యపడలేదు. ఆ అవకాశాన్ని కోల్పోవడం అనేది నా హృదయాన్ని ముక్కలు చేసింది. 

చాలా నిరుత్సాహపడ్డాను. ఇదే విషయాన్ని మా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అను పార్థసారథికి చెప్పాను. ఓ రోజు   అను ఓ కొత్త ఆలోచనతో నా దగ్గరకు వచ్చింది. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిలా మనం ఫొటోషూట్‌ చేద్దామని చెప్పింది. నేను సరే అన్నాను. అలా ఆ ఫొటోషూట్‌ చేశాం. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి 108వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళిగా ఈ ఫోటోలను రిలీజ్‌ చేస్తే, మంచి స్పందన లభించింది. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిగారిలా నటిస్తారా? అంటూ నాకు ఏడు అవకాశాలు వచ్చాయి. మీ దగ్గర సరైన అనుమతులు ఉంటేనే నన్ను సంప్రదించండి అని వారితో చెప్పాను’’ అని తెలిపారు విద్యా బాలన్‌.  

ఈ సంగతి ఇలా ఉంచితే... ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ‘ఎమ్మెస్‌: ఏ లెగసీ ఆన్‌ స్క్రీన్‌’ అనే బయోపిక్‌ రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిగా హీరోయిన్‌ రష్మికా మందన్నా నటిస్తుండగా, ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి      దర్శకత్వం వహిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement