దేవా చేసిన పనికి బాలు అసంతృప్తి.. మళ్లీ పాడించి.. | Music Director Deva And SP Balasubrahmanyam Musical Bond, Timeless Songs That Still Captivate Fans, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Music Director Deva: దేవా బాణీలకు బాలు గాత్రం.. తరాలు మారినా..

Oct 17 2026 12:40 PM | Updated on Oct 17 2026 1:55 PM

Music Director Deva Bonding With Singer Balasubramanyam

ప్రముఖ సంగీత దర్శకుడు దేవ(75) కన్నుమూశారు. అయితే దేవా, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కలయికలో ఎన్నో మధురమైన పాటలను ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు.  గతంలో దేవా అందించిన ఎన్నో బాణీలకు బాలు తన గాత్రంతో ప్రాణం పోశారు. ముఖ్యంగా రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘బాషా’ సినిమాలోని పాటలు విశేష ఆదరణ పొందాయి. 

మళ్లీ పాడిన ఎస్పీ..
బాషా చిత్రంలోని ‘నేను ఆటో వాణ్ని’ పాటకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. వీరి కలయికలో వచ్చిన ‘తొలిప్రేమ’, ‘ఇందు’ వంటి చిత్రాల్లోని పాటలు కూడా సంగీత ప్రియులను అలరించాయి. ఇలా దేవా స్వరాలు, బాలు గాత్రం కలిసి ఎన్నో మధురమైన సంగీత జ్ఞాపకాలను అందించాయి. రజనీకాంత్‌ నటించిన ‘అన్నామలై’ సినిమాలోని ఓ పాట విషయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ చిత్రంలోని ‘పెన్ పురా’ పాటను దేవా తొలుత యేసుదాస్‌తో పాడించారు. దీనిపై ఎస్పీబీ సరదాగా స్పందిస్తూ.. ఆ ఒక్క పాట తనకు ఎందుకు ఇవ్వలేదని అడిగారట. ఆ తర్వాత అదే పాటను కన్నడంలో ఎస్పీ బాలుతో పాడించినట్లు దేవా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. 

తరాలు మారినా తగ్గని క్రేజ్‌!
ఇలా దేవా సంగీతం, ఎస్పీ బాలు గాత్రం కలిసిన పాటలు ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. పాటలోని భావానికి తగ్గట్టుగా తన గాత్రాన్ని మలచడం బాలు ప్రత్యేకత కాగా.. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా బాణీలు అందించడం దేవా శైలి. ఈ ఇద్దరు దిగ్గజాల కలయికలో వచ్చిన పాటలు కాలంతో సంబంధం లేకుండా సంగీత ప్రియుల మనసుల్లో నిలిచిపోయాయి. 

(ఇదీ చదవండి: జైలర్‌2 బ్లాక్‌ బస్టర్‌.. హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement