
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ నటిస్తోన్న తాజా చిత్రం 'బడ్డీ'. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సామ్ ఆంటోన్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
తాజగా బడ్డీ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'ఆగస్టు 2న బడ్డీ వస్తున్నాడు.. క్యాలెండర్‌లో ఈ డేట్‌ను మార్క్ చేసుకోండి.. థియేటర్లలో కలుసుకుందాం' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో టెడ్డీ బేర్‌కు సాయం చేసే కెప్టెన్ పాత్రలో హీరో అల్లు శిరీష్ కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో బడ్డీ ప్రేక్షకులను అలరించనున్నారు. చాలా రోజుల తర్వాత అజ్మల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
Buddy is now releasing on August 2nd. Please mark the date on your calendar. And see you soon in the theatres!!! 🐻🧸✨ pic.twitter.com/JqcJNqhlBe
— Allu Sirish (@AlluSirish) July 17, 2024