
కార్తీక్‌రాజు, నోయల్ ,మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం "దీర్ఘాయుష్మాన్ భవ". ఈ సినిమాకు ఎం.పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం ట్రైలర్, పాటలను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..'కొత్త నిర్మాతలకు చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. అయితే కొత్త నిర్మాతలు చిత్ర పరిశ్రమ మీద కనీసం ఒక ఏడాది పాటు అవగాహన పెంచుకుని వస్తే బాగుంటుంది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ తరపున మేము ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. పెద్ద, చిన్న సినిమాల సమస్యలు, సాధ్యాసాధ్యాల గురించి ఛాంబర్‌లో చర్చించబోతున్నాం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, మంచి అభిరుచితో, మంచి కాంబినేషన్ ఆర్టిస్టులతో ఈ సినిమా తీసినట్లు అనిపిస్తోంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా" అని అన్నారు.
నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. "చిన్న సినిమాల సమస్యలను తీర్చేందుకు ఇటు పరిశ్రమ, అటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. మల్టీ ఫ్లెక్స్‌ల్లో పేదవాడు సినిమా చూసే విధంగా ఆక్యుపెన్సీలో 20 శాతం టిక్కెట్ రేట్లను 75 రూపాయలుగా నిర్ణయించాలి. ఫామిలీ అంతా కూర్చుని హాయిగా చూసుకునేలా ఈ చిత్రం ఉంటుంది" అని అన్నారు. చిత్ర దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ.. "ఫ్యామిలీ ప్యాక్ చిత్రమిది. అందరినీ ఆహ్లదపరిచే కామెడీ, ఉంది. సోసియో ఫాంటసీగా దీనిని మలిచాం" అని తెలిపారు. ఈ చిత్రంలో ఆమని, కాశీ విశ్వనాధ్, పృథ్వీరాజ్, సత్యం రాజేష్, గెటప్ శ్రీను , తాగుబోతు రమేష్, జె మిని సురేష్, నోయల్, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వినోద్ సంగీతమందించారు. ఈ చిత్రం ఈనెల 11న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.