
తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకొని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి కీర్తిసురేష్( Keerthy Suresh). మలయాళంలో బాల తారగా కెరీర్ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత కథానాయకిగా అవతారమెత్తి మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రలో జీవించి జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. అదేవిధంగా తక్కువ కాలంలోనే ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.
ఇకపోతే కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే తన బాల్య స్నేహితుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈమె చేతిలో రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు ఉన్నాయి. అయితే వివాహానంతరం కీర్తిసురేష్ కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు. అయినా ఖాళీగా లేరు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.
కాగా వివాహానంతరం ఈ అమ్మడు కాస్త బరువెక్కారనే కామెంట్స్‌ను ఎదుర్కొన్నారు. అలాంటి కామెంట్స్‌పై స్పందించిన కీర్తిసురేష్ పెళ్లి తర్వాత బరువు పెరిగిన విషయం నిజమేనన్నారు.. అయితే బరువు తగ్గడానికి కార్డియో కసరత్తులు చేసి స్లిమ్‌గా మారడానికి పోరాడానన్నారు. వారానికి 300 నిమిషాలు ప్రకారం ఎక్సర్‌సైజ్ చేసి ఇప్పుడు 9 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. తీవ్ర ప్రయత్నం, ఆహారపు కట్టుబాట్లు కలిస్తే ఫలితం సాధ్యమేనని కీర్తి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నూతన చిత్రాలకు సంబంధించిన కథలు వింటున్నానని, త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని ఆమె తెలిపారు.