రవితేజ నా రూమ్ మేట్‌: టాలీవుడ్ డైరెక్టర్‌ ఆసక్తికర కామెంట్స్ | Tollywood Director YVS Chowdary Interesting Comments About Ravi Teja | Sakshi
Sakshi News home page

Ravi Teja: రవితేజ ఎలా పైకి వచ్చాడో నాకు తెలుసు: వైవీఎస్ చౌదరి

Aug 9 2024 6:37 PM | Updated on Aug 9 2024 6:59 PM

Tollywood Director YVS Chowdary Interesting Comments About Ravi Teja

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇందులో ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హరీశ్‌ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌, ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా రవితేజ గురించి టాలీవుడ్ డైరెక్టర్‌ వైవీఎస్ చౌదరి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మిస్టర్‌ బచ్చన్‌తో పాటు డబుల్‌ ఇస్మార్ట్‌ కూడా బ్లాక్ బస్టర్‌ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నా రూమ్ మేట్ రవితేజ ఎప్పటికీ నా హృదయంలో ఉంటారని అన్నారు. ఎందుకంటే రవితేజ ఎంత కష్టపడి వచ్చాడో తనకు తెలుసన్నారు. నేను, రవితేజ ఎనిమిదేళ్ల పాటు రూమ్‌మేట్స్ అని వైవీఎస్ చౌదరి వెల్లడించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement