
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఆరోపణలతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన పూనమ్ మరో ట్వీట్ చేసింది. ఒరిజినల్ కంటెంట్, స్క్రిప్ట్ ఉన్న దర్శకుడు క్రిష్ అంటూ కొనియాడింది. ఎన్నో కాపీరైట్ సమస్యలు, పీఆర్ స్టంట్‌లు ఉన్న దర్శకుడికి వచ్చినంత గుర్తింపు, విజయం లభించడం లేదని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ చూస్తే మరోసారి త్రివిక్రమ్‌ను ఉద్దేశించే పరోక్షంగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్‌కు ముందు పూనమ్ చేసిన ట్వీట్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెలలోనే రిలీజ్ కానుందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈనెల 3న ఉదయం 11 గంటల 10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించగా.. కారణాలేంటో తెలీదు గానీ మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం కొడుకు జ్యోతికృష్ణ.. డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో బాబీ డియోల్, అనుపమ ఖేర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు.
Krish a director with original content and authentic scripts doesn’t get as much recognition or success like that of a director with multiple copyright issues and pr stunts.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 2, 2025
త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు
పూనమ్ కౌర్ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే మెయిల్ ద్వారా ఇప్పటికే మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపింది. క్లియర్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్‌పైనే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. అంతేకాదు రాజకీయ, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరో కాపాడుతున్నారని కూడా చెప్పానని పూనమ్ కౌర్ ప్రస్తావించింది. ఈ విషయంపై నేను మహిళల గ్రూప్‌తో మాట్లాడతానని కూడా పూనమ్ వెల్లడించింది. అంతేకాకుండా తన మెయిల్‌కు రిప్లై కూడా వచ్చిన స్క్రీన్‌షాట్‍ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.