
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో వస్తోన్న తాజా చిత్రం 'పరదా'. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్ రిలీజ్ చేయగా..ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అనుపమ ఫుల్ బిజీగా ఉంది. దీంతో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.
తాజాగా తన మూవీ పరదా ప్రమోషన్స్ను రోటీన్కు భిన్నంగా నిర్వహించింది. వైజాగ్‌లో ఏకంగా రోడ్డుపై మైక్ పట్టుకుని ప్రచారం చేసింది. పరదాలమ్మా.. పరదాలు.. రంగురంగుల పరదాలు.. తీసుకోవాలమ్మా.. తీసుకోవాలి అంటూ కారులో నిలబడి తన మూవీని ప్రమోట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.
Vizag ♥️ #paradha on August 22nd pic.twitter.com/mOY1Q5bIF6
— Anupama Parameswaran (@anupamahere) August 12, 2025
Actress Anupama Parameswaran markets her 22 August release #Paradha during her Andhra tour! pic.twitter.com/9RxeYvglMI
— idlebrain jeevi (@idlebrainjeevi) August 12, 2025