
బెజవాడ బేబక్క సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. తన అసలు పేరు మధు నెక్కంటి (Madhoo Singer Nekkanti). ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులర్ అయింది. బెజవాడ బేబక్కగా ఫేమస్ అయింది. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లోనూ పాల్గొంది. గలగలా మాట్లాడే ఈమె తొలివారమే ఎలిమినేట్ అయింది.
కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్క
తాజాగా బేబక్క కొత్తిల్లు కొనుగోలు చేసింది. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనుక్కుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. నా ఇంటి గృహప్రవేశానికి అమ్మ ముఖ్య అతిథి అంటూ వీడియో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు బేబక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ గృహప్రవేశ వేడుకకు హీరో శ్రీకాంత్ సహా తదితరులు అతిథులుగా విచ్చేశారు.

పిల్లి కోసం ప్రత్యేకంగా..
'నేను ఎప్పటినుంచో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. ఇన్నాళ్లకు సొంతింటి కల సాకారం అయింది' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇకపోతే.. అపార్ట్‌మెంట్‌లో 25వ అంతస్థులో ఉన్న ఫ్లాట్‌నే తన ఇంటిగా ఎంపిక చేసుకుంది బేబక్క. ఇందులో మూడు బెడ్‌రూమ్స్ ఉన్నాయి. ఈ ఇంట్లో పిల్లి ఆడుకోవడం కోసం ఓ గోడను డిఫరెంట్‌గా డిజైన్ చేయించింది. పూజగదిని నీట్‌గా, అందంగా కట్టించుకుంది.
చదవండి: