'Thanthiram' Telugu Movie Poster Launch - Sakshi
Sakshi News home page

Thanthiram Movie Poster: భార్యాభర్తల మధ్య ఆత్మ ప్రవేశిస్తే 'తంతిరం' చూడాల్సిందే

Aug 10 2023 10:12 AM | Updated on Aug 10 2023 10:22 AM

Thanthiram Telugu Movie Poster Launch - Sakshi

శ్రీమతి కాండ్రగుల లావణ్య రాణి సమర్పణలో 'సినిమా బండి ప్రొడక్షన్స్' పతాకంపై శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించిన చిత్రం 'తంతిరం'. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ కాండ్రగుల (SK) నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

(ఇదీ చదవండి: Jailer Review: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ)

ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ కాండ్రగుల మాట్లాడుతూ ' ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇది హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రం. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మా 'తంతిరం' చిత్రం చూడాల్సిందే.

మా చిత్రం కేరళ ప్రాంతాల్లో అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్నాము, షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. ప్రస్తుతానికి నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. ఈరోజు మా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాం. త్వరలోనే టీజర్, ట్రైలర్‌తో  మీ ముందుకు వస్తాం' అని నిర్మాత శ్రీకాంత్  తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement