దళపతి బర్త్ డే స్పెషల్.. 'ద గోట్' వీడియో అదిరింది! Thalapathy Vijay Birthday The Goat Movie Special Video. Sakshi
Sakshi News home page

Vijay The GOAT: బర్త్ డ్ ట్రీట్.. ఫ్యాన్స్‌కి సూపర్ క్రేజీ కిక్

Jun 22 2024 7:25 AM | Updated on Jun 22 2024 9:20 AM

Thalapathy Vijay Birthday The Goat Movie Special Video

దళపతి విజయ్ పుట్టినరోజు. దీంతో ఫ్యాన్స్ ఆల్రెడీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని డబుల్ చేయడం కోసమా అన్నట్లు ఈ తమిళ హీరో కొత్త మూవీ నుంచి క్రేజీ వీడియో వచ్చింది. ఇదైతే అభిమానులకు మాములు కిక్ ఇవ్వట్లేదు. ఎందుకంటే కేవలం 50 సెకన్ల వీడియోలోనే ఫుల్ హై ఇచ్చారు.

(ఇదీ చదవండి: కల్కి 2898 ఏడీ.. రిలీజ్ ట్రైలర్‌ వచ్చేసింది)

విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ద గోట్' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకుడు. ఇదివరకే షూటింగ్ చివరకొచ్చేసింది. సెప్టెంబరు 5న థియేటర్లలో మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

తాజాగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోల ఇద్దరు విజయ్‌లు బైక్‌పై వెళ్తుండగా.. వీళ్లని విలన్స్ ఛేజ్ చేస్తూ ఉంటారు. దీనికి యువన్ శంకర్ రాజా క్రేజీ మ్యూజిక్ ఇచ్చాడు. స్పెషల్ వీడియోతో ఇంతలా ఆకట్టుకున్నారు. మరి ఫుల్ ఎలా ఉంటుందో చూడాలి? ఇకపోతే ఈ మూవీలో ప్రభుదేవా, ప్రశాంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. 

(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)

Advertisement
 
Advertisement
Advertisement