కల్కి 2898 ఏడీ.. రిలీజ్ ట్రైలర్‌ వచ్చేసింది | Prabhas, Nag Ashwin's Kalki 2898 AD Second Trailer Out Now | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Release Trailer: కల్కి 2898 ఏడీ.. రిలీజ్ ట్రైలర్‌ వచ్చేసింది

Jun 21 2024 8:47 PM | Updated on Jun 22 2024 10:51 AM

Prabhas, Nag Ashwin's Kalki 2898 AD Second Trailer Out Now

నాగ్‌ అశ్విన్‌-ప్రభాస్‌ల కాంబోలో రానున్న చిత్రం  'కల్కి 2898 ఏడీ'.  సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడులైన ట్రైలర్‌కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ అభిమానుల్లో హీట్‌ పెంచింది. అయితే తాజాగా కల్కి రెండో ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ వంటి స్టార్స్‌తో పాటు శోభన కూడా ఉన్నారు. వీరందరూ కూడా తెలుగు డబ్బింగ్‌ చెప్పి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కల్కి 2898 ఏడీ చిత్రంలో భైరవగా ప్రభాస్ నటిస్టే అశ్వత్థామ పాత్రను బాలీవుడ్ దిగ్గజం అమిత్ బచ్చన్ పోషించారు.

భారీ బడ్జెట్‌లో కల్కి 2899 ఏడీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమా రన్‌ టైమ్‌ 180 నిమిషాలు ఉంది. 'కల్కి' రిలీజ్‌కు ముందే రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో  ప్రీ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా టికెట్స్‌ అన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ‌ విషయంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డులను కొన్ని గంటల్లోనే కల్కి బ్రేక్ చేసింది.  విదేశాల్లో ఎక్కువ ఐమ్యాక్స్‌ల్లో విడుదల అవుతున్న సినిమాగా కల్కి మరో రికార్డును క్రియేట్‌ చేసింది. వాటిలో జూన్‌ 26నే ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement