ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే? Prabhas Kalki Movie No Pre Release Event In Telugu States. Sakshi
Sakshi News home page

Prabhas Kalki: తెలుగు ప్రేక్షకులకు ఆ ఛాన్స్ లేనట్లేనా?

Jun 21 2024 7:18 AM | Updated on Jun 21 2024 9:38 AM

Prabhas Kalki Movie No Pre Release Event In Telugu States

డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు చేదు వార్త. అదేంటి త్వరలో 'కల్కి' రిలీజ్ కానుంది. ఈ టైంలో బ్యాడ్ న్యూస్ ఏంటా అని మీరు అనుకోవచ్చు. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరి ప్రమోషన్స్ చేస్తున్నారు. అలా ఓ విషయమై ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నారా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)

సాధారణంగా చిన్నా పెద్దా సినిమాల విడుదల ముందు ఎవరికి తగ్గట్లు వాళ్లు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది చేస్తారు. కానీ ఇప్పుడు  'కల్కి' నిర్మాతలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించట్లేదని, ఇలాంటి ఈవెంట్ ఏం ఉండట్లేదని సమాచారం. శుక్రవారం సాయంత్రం కూడా యూట్యూబ్‌లో మరో కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీనిబట్టి కూడా ఈవెంట్ ఏం నిర్వహించరని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసినట్లే.

'కల్కి'కి అసలు ప్రమోషన్స్ చేయట్లేదని ఓ వైపు అభిమానులు బాధ పడుతున్నప్పటికీ.. చిత్రబృందం మాత్రం షార్ట్ అండ్ స్వీట్ అన్నట్లు బుజ్జి, ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఇలా సింపుల్‌గా చేసేస్తున్నారు. చూడాలి మరి 'కల్కి' నిర్మాతలు ఏం ప్లాన్ చేస్తున్నారో?

(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!)

Advertisement
 
Advertisement
Advertisement