సంగీత ప్రియులను అలరించే షో.. ప్రోమో అదుర్స్! | Telugu Indian Idol Season 3 Launch Promo Out Now | Sakshi
Sakshi News home page

Telugu Indian Idol Season 3: ఇండియన్ ఐడల్‌ సీజన్‌-3.. లాంఛ్‌ ప్రోమో అదుర్స్‌!

Jun 6 2024 9:54 PM | Updated on Jun 7 2024 9:25 AM

Telugu Indian Idol Season 3 Launch Promo Out Now

టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన హిట్‌షో ఇండియన్‌ ఐడల్‌. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత రెండు సీజన్లకు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోసారి సంగీత ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇండియన్ ఐడల్‌ మరో సీజన్‌ ఈనెల 14 నుంచి ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు.

తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 లాంఛ్ ప్రోమో వచ్చేసింది. ఈసారి జడ్జీలుగా మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్, సింగర్స్‌ గీతామాధురి, శ్రీరామచంద్ర, కార్తీక్ వ్యవహరించనున్నారు. కొత్త సీజన్‌లో కంటెస్టెంట్ల ఎమోషన్స్‌ ఫుల్‌గా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. ఈ షో మూడోసారి ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది.  ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 7 గంటలకు ఈ షో స్ట్రీమింగ్ కానుంది.  దీంతో వారం ముందుగానే ప్రోమోను ఆడియన్స్‌కు పరిచయం చేశారు మేకర్స్.
 

Advertisement
 
Advertisement
Advertisement