భయపెట్టే తంతిరం  | Sakshi
Sakshi News home page

భయపెట్టే తంతిరం 

Published Fri, Sep 15 2023 1:04 AM

Tantiram Movie Official Teaser - Sakshi

భార్యాభర్తల మధ్యలో ఓ ఆత్మ ప్రవేశించడం వల్ల వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితమైంది? అనే కథాంశంతో రూపొందిన హారర్‌ అండ్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘తంతిరం’. శ్రీకాంత్‌ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించారు. ముత్యాల మెహర్‌ దీపక్‌ దర్శకత్వంలో శ్రీకాంత్‌ కంద్రగుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘ఆడియన్స్‌కు గుర్తుండిపోయే చిత్రం ఇది’’ అన్నారు శ్రీకాంత్‌ గుర్రం. ‘‘ఈ సినిమా చూసి ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు’’ అన్నారు మెహర్‌ దీపక్‌. ‘‘బడ్జెట్‌ ఎక్కువ అవుతున్నా రాజీ పడకుండా నిర్మించాం. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్‌ చేయాలి’’ అన్నారు శ్రీకాంత్‌ కంద్రగుల.
 

Advertisement
 
Advertisement
 
Advertisement