
సినీ దర్శకుడు నారాయణమూర్తి (59) (R D Narayanamurthy) మంగళవారం రాత్రి చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. నారాయణమూర్తి 'మనదై తిరిడి విట్టాయ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత 'ఒరు పొన్ను ఆరు పయ్యా' చిత్రం చేశారు. పలు టీవీ సీరియల్స్‌కు సైతం దర్శకత్వం వహించిన నారాయణమూర్తి ఇటీవల అనారోగ్యంతో చైన్నెలోని ఆస్పత్రిలో చేరారు.
శుక్రవారం అంత్యక్రియలు
అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. స్థానిక పంబల్‌లో నివసించిన నారాయణమూర్తికి భార్య హంసవేణి, లోకేశ్వరన్ అనే కుమారుడు ఉన్నారు. లోకేశ్వరన్ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన శుక్రవారం చైన్నెకి రానున్నారు. అదేరోజు పంబల్‌లో దర్శకుడు నారాయణమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దర్శకుడి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: నేనూ సెలవు తీసుకుంటా!