తల్లి కాబోతున్న ప్రముఖ మహిళా యాంకర్ | Tamil Anchor Priyanka Deshpande Announce Pregnancy | Sakshi
Sakshi News home page

Anchor Priyanka: యాంకర్ రెండో పెళ్లి.. రెండోసారి ప్రెగ్నెన్సీ

Jun 23 2026 12:43 PM | Updated on Jun 23 2026 12:49 PM

Tamil Anchor Priyanka Deshpande Announce Pregnancy

తమిళంలో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక శుభవార్త చెప్పేసింది. తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అయితే సరదాగా డ్యాన్స్ చేస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష.. ఏమైంది?)

యాంకర్ ప్రియాంక.. చాన్నాళ్ల పాటు ప్రేమించిన ప్రవీణ్ కుమార్‌ని 2016లో పెళ్లి చేసుకుంది. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. మరి ఏమైందో ఏమోగానీ 2022లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న ప్రియాంక.. గతేడాది డీజే వశిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తాను తల్లి కాబోతున్న విషయాన్ని ఈమె సోషల్ మీడియాలో వెల్లడించింది.

గతంలో బిగ్‌బాస్ షోలోనూ పాల్గొన్న ప్రియాంక.. కొద్దిలో ట్రోఫీ చేజార్చుకుంది. రన్నరప్‌గా నిలిచింది. పలు టీవీ షోలు బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు తల్లి కాబోతుంది.

(ఇదీ చదవండి: శుభవార్త.. తల్లిదండ్రులయిన టాలీవుడ్ హీరోహీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement