మరో ఐటం సాంగ్‌లో మెరిసిన తమన్నా.. | Tamannaah Bhatia Item Song Nasha From Raid 2 Released | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: నషా అంటూ ఐటం సాంగ్‌లో చిందేసిన తమన్నా..

Apr 11 2025 12:29 PM | Updated on Apr 11 2025 12:43 PM

Tamannaah Bhatia Item Song Nasha From Raid 2 Released

మిల్కీ బ్యూటీకి డ్యాన్స్‌ చేయడమంటే మహా ఇష్టం. అందుకే ఐటం సాంగ్స్‌ ఆఫర్‌ వచ్చినప్పుడు డ్యాన్స్‌కు స్కోప్‌ ఉంటోందని వెంటనే ఓకే చెప్పేస్తోంది. అలా జైలర్‌లో నువ్వు కావాలయ్యా.., స్త్రీ 2లో ఆజ్‌ కా రాత్‌.. పాటతో సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేసింది. తాజాగా రైడ్‌ 2లోని నషా పాటకు చిందేసింది. రైడ్‌ 2లో తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఐటం సాంగ్‌ చేస్తున్నట్లు ఇటీవల కొన్ని ఫోటోలు లీకయ్యాయి.

మరో ఐటం సాంగ్‌..
దీంతో చిత్రయూనిట్‌ ఎలాంటి సస్పెన్స్‌లు లేకుండా నషా పాటను విడుదల చేసింది. ఎప్పటిలాగే తమన్నా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో, స్టెప్పులతో అదరగొట్టేసింది.  ఆజ్‌ కీ రాత్‌ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన విజయ్‌ గంగూలీయే ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. రైడ్‌ 2 విషయానికి వస్తే.. 2018లో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ రైడ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌ కథానాయకుడిగా, వాణీ కపూర్‌ హీరోయిన్‌గా నటించారు. రితేశ్‌ దేశ్‌ముఖ్‌ విలన్‌గా యాక్ట్‌ చేశారు. మే 1న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

 

చదవండి: ఆస్కార్‌లో కొత్త విభాగం.. ఆర్‌ఆర్‌ఆర్‌ విజువల్‌తో అనౌన్స్‌మెంట్‌

Advertisement
 
Advertisement
Advertisement