
సినిమా ఆశల పల్లకి, గ్లామర్ వలయం. అంతకు మించి ప్రతిభతోపాటు అదృష్టం కూడా ఉండాల్సిన రంగం. ఈ అన్నింటిని అందిపుచ్చుకున్న బ్యూటీ తమన్నా. ఈ ఉత్తరాది భామ కథానాయకిగా దక్షిణాదిలోనే సాధించారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదు. అంతే కాదు ఐటమ్ సాంగ్స్ తనకు తానే సాటి అనిపించుకున్న ఈ బ్యూటీ.. రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయకిగా రాణించారు. అయితే, తమన్నాకు ఇటీవల అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇందుకు వ్యక్తిగత విషయాలు కూడా ఒక కారణం కావచ్చు. మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందడం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అందు కోసం కసరత్తు చేస్తూ స్లిమ్‌గా తయారవుతున్నారు.
ఇటీవల ఒక భేటీలో తమన్నా మాట్లాడుతూ తాను కసరత్తు చేయడం ప్రారంభించి చాలా కాలం అయ్యిందన్నారు. అయితే ఆహారం, పని, లేక వ్యక్తిగత ఇష్టాలు ఏవైనా తన ఏం చెబుతుందో అదే చేస్తానని చెప్పారు. ఏదీ బలవంతంగా చేయనని అన్నారు. తనకు అలసటగా ఉన్నా.. సరిగ్గా నిద్ర లేకపోయినా, కసరత్తులు చేయకుండా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తానని చెప్పారు. విరామ సమయాల్లో ఏదైనా ప్రశాంత ప్రదేశానికి వెళ్తానని, అక్కడ అన్నీ మరిచి ధ్యానం చేస్తానని చెప్పారు. అదే విధంగా దేవాలయాలకు వెళ్లడానికి ఇష్టపడతానన్నారు. అది మనసుకు ప్రశాంతతను ఇవ్వడంతోపాటు మంచి అనుభవాన్నిస్తుందన్నారు. సమీప కాలంలో కాశీ పయనాన్ని మరచిపోలేనన్నారు. కాశీ గొప్ప ఆధ్యాత్మిక నగరం అని పేర్కొన్నారు. అది తన మనసును ఎంతగానో ఆకట్టుకుందన్నారు.
తాను ఎక్కడికి వెళ్లినా కుటుంబంతో కలిసే వెళ్లతానన్నారు. దేవాలయాలకు మెట్ల దారి ద్వారా పయనించడంతో చరిత్రను తెలుచుకోగలుగుతామన్నారు. కాశీలో వివరించలేని ప్రశాంతత ఉంటుందన్నారు. తనకు గ్లామరస్ నటిగా ముద్ర వేశారని, అయితే ఆరంభంలో నటిగా కొన్ని కట్టుబాట్టు విధించుకోవడంతో ఛాలెంజ్‌తో కూడిన, శక్తివంతమైన కథా చిత్రాలను కోల్పోయాననే భావన కలిగిందన్నారు. అందువల్ల తనకు తానే విధించుకున్న నో కిస్ నిభంధనలను పక్కన పెట్టేశానన్నారు. ఆ తరువాతనే గ్లామరస్ పాత్రల్లో నటించడం మొదలెట్టానని నటి తమన్నా చెప్పారు.