'కల్కి' ప్రభాస్‌ పాత్ర గురించి స్వప్నదత్‌ ఆసక్తికర కామెంట్స్‌ | Sakshi
Sakshi News home page

'కల్కి' ప్రభాస్‌ పాత్ర గురించి స్వప్నదత్‌ ఆసక్తికర కామెంట్స్‌

Published Sat, Mar 23 2024 9:23 AM

Swapna Dutt Comments On Kalki 2898 AD Movie - Sakshi

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో 'కల్కి 2898 ఎ.డి' చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మహా శివరాత్రి కానుకగా ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ... ఈ చిత్రంలో ప్రభాస్‌ పాత్ర పేరు 'భైరవ' అని పేర్కొని, ఆయన లేటెస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.  

తాజాగా 'భైరవ' పాత్ర గురించి నిర్మాత స్వప్న దత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన   ‘సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌’ వేదికపై  కల్కి చిత్రం గురించి ఆమె ఇలా మాట్లాడారు. 'ప్రభాస్ పోషిస్తున్న 'భైరవ' పాత్ర చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది' అంటూ స్వప్న పేర్కొన్నారు. అందుకు సంబంధిత విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రొడ్యూసర్‌ వ్యాఖ్యలపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కల్కి సినిమా కథ గురించి గతంలో డైరెక్టర్‌  నాగ్‌ అశ్విన్‌ కూడా ఇలా వ్యాఖ్యానించారు. 'మహాభారతంతో కథ మొదలై.. క్రీస్తుశకం 2898లో ముగుస్తుంది. కల్కి కథ మొత్తం ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా సినిమా విలువలు ఉంటాయి. గతం, భవిష్యత్తు ప్రపంచాలను క్రియేట్‌ చేయడంలో భారతీయతని ప్రతిబింబించేలా ఉంటాయి. అందరూ అనుకున్నట్లు హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం 'బ్లేడ్‌ రన్నర్‌' చిత్రంతో కల్కికి పోలికలు ఉండవు. అని అశ్విన్‌ తెలిపాడు.  మే 9న విడుదల కానున్న కల్కి సినిమా ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. 

Advertisement
 
Advertisement