ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్ | Prabhas Returned Remuneration Tamil Distributor | Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్ గురించి తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన నిజాలు

Aug 19 2025 1:44 PM | Updated on Aug 19 2025 2:41 PM

 Prabhas Returned Remuneration Tamil Distributor

మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ పెద్దగా బయట కనిపించడు. తన సినిమాలేవో తాను చేసుకుంటూ ఉంటాడు. రిలీజ్ టైంలో, అది కూడా సమయం దొరికితేనే ప్రమోషన్లలో పాల్గొంటూ ఉంటాడు. ప్రభాస్ గురించి రూమర్స్ వస్తుంటాయి గానీ అవి నిజమో కాదో అనేది కూడా పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన విషయం మాత్రం వైరల్ అవుతోంది. ప్రభాస్.. తమకు రూ.50 కోట్ల తిరిగొచ్చాడని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.

'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతూ వచ్చాయి. 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలకు కలెక్షన్స్‌తో పాటు కొంతమేర నష్టాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చాడు. 'రాధేశ్యామ్' మూవీకిగానూ ప్రభాస్.. రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని, కానీ సినిమా ఆడకపోయేసరికి రూ.50 కోట్లు నిర్మాతకు ఇచ్చాడని, ఈ మొత్తాన్ని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వమని కోరాడని వైరల్ అవుతున్న వీడియోలో సదరు డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు.

(ఇదీ చదవండి: దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?)

మరి ఇది ఎప్పటి వీడియోనో తెలియదు గానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభాస్‌ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇప్పటి జనరేషన్‌లో చాలామంది హీరోలు.. పారితోషికం ఎక్కువగానే తీసుకుంటున్నారు గానీ ఫ్లాప్ అయిన నష్టాలొస్తే మాత్రం తిరిగి ఇచ్చేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లతో పోలిస్తే ప్రభాస్ డిఫరెంట్ అని చెప్పొచ్చు.

ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. 'రాజాసాబ్' చివరిదశ పనుల్లో ఉంది. లెక్క ప్రకారం డిసెంబరు 5న థియేటర్లలోకి రావాలి. కానీ సంక్రాంతికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు 'ఫౌజీ'(వర్కింగ్ టైటిల్) షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇది వచ్చే వేసవికి రిలీజ్ కావొచ్చని అంటున్నారు. వీటితోపాటు సెప్టెంబరు చివర్లో సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్' షూటింగ్‌లోనూ ప్రభాస్ పాల్గొననున్నాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి అనసూయ.. ఇదిగో క్లారిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement