
పైన కనిపిస్తున్న నటి వయసు 59. ఈ ఏజ్‌లో కూడా ఆమె జిమ్‌లో చెమటలు చిందిస్తోంది. చిన్నపాటి వ్యాయామాలే కాకుండా డంబుల్స్ ఎత్తుతూ కష్టమైన వర్కవుట్స్ కూడా అవలీలగా చేస్తోంది. ఇంతకీ ఆ ఫేమస్ నటి ఎవరో గుర్తుపట్టారా? తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. సౌత్ ఇండస్ట్రీకి బాగా పరిచయమున్న పేరు. ఆవిడే నదియా (Nadiya Moidu).. ఇప్పటికీ అందంగా, ఫిట్‌గా కనిపించే ఆమె వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు మీరు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సినిమా
1984లో వచ్చిన నూకెత్త దూరతు కన్నుం నట్టు అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో అమ్మ, అత్త పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. తెలుగులో.. అత్తారింటికి దారేది, దృశ్యం, దృశ్యం 2, నా పేరు సూర్య, అఆ, అంటే సుందరానికి వంటి పలు చిత్రాల్లో నటించింది.
చదవండి: 11 ఏళ్ల బంధానికి స్వస్తి? భార్యకు కన్నడ హీరో విడాకులు!