ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్! | Vyjayanthi Movies files Case On VFX Company Over Kalki Leak - Sakshi
Sakshi News home page

Kalki Movie: 'కల్కి' నిర్మాతలు వదల్లేదు.. వాళ్లని కోర్టుకి ఈడ్చారు!

Published Sun, Sep 17 2023 5:16 PM

Vyjayanthi Pictures Kalki Movie Pic Criminal Case on VFX Company - Sakshi

సినిమా హిట్ అవుతుందా లేదా అనేది పక్కనబెడితే చాలా ఏళ్ల నుంచి నిర్మాతలు, ఇండస్ట్రీని వేధిస్తున్న సమస్య ఒకటుంది. అదే పైరసీ. షూటింగ్ జరుగుతున్నప్పుడు కావొచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ టైంలో కావొచ్చు. చాలా మూవీస్ ఈ సమస్య బారిన పడుతున్నాయి. లేదంటే ఫొటోలు లీకవుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ 'కల్కి' నుంచి పిక్ ఒకటి బయటకొచ్చింది. దీనిపై నిర్మాతలు.. అవతలి వాళ్ల గుండె ఆగిపోయే నిర్ణయం తీసుకున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో 'సలార్' ఈ ఏడాది రానుండగా, 'కల్కి' అలియాస్ ప్రాజెక్ k.. వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. కొన్నాళ్ల క్రితం ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో టీమ్ అంతా బిజీగా ఉన్నారు. అయితే సినిమాలోని కీలకమైన సీన్‌లో ప్రభాస్ పిక్ ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపించింది. 

(ఇదీ చదవండి: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఆడియో లీక్‌పై దిల్‌ రాజు ఫైర్‌.. పోలీసులకు ఫిర్యాదు)

అయితే 'కల్కి' మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్‌ చేస్తున్న కంపెనీ నుంచే ఈ లీక్ జరిగినట్లు తేలింది. దీనికి కారణమైన వ్యక్తిని సదరు కంపెనీ.. వెంటనే తొలగించింది. కానీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అస్సలు ఊరుకోలేదు. లీక్ చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టారని, సదరు కంపెనీపై పరువు నష్టం దావా వేశారని తెలుస్తోంది. అయితే ఈ రేంజులో సీరియస్ అవుతుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే గతంలోనూ తెలుగులో పలు సినిమాలు ఇలా లీకుల బారిన పడ్డాయి. కానీ వైజయంతీ నిర్మాతలు తీసుకున్నారని వినిపిస్తున్న ఇలాంటి డెసిషన్ అయితే ఇప్పటివరకు ఎవరూ తీసుకోలేదని చెప్పొచ్చు. మరి ఈ విషయంలో నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలి.

(ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' దర్శకుడి బర్త్ డే.. గిఫ్ట్‌గా ల్యాప్‌ట్యాప్స్)

Advertisement
 
Advertisement
 
Advertisement