‘గేమ్‌ ఛేంజర్‌’ ఆడియో లీక్‌పై దిల్‌ రాజు ఫైర్‌.. పోలీసులకు ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

‘గేమ్‌ ఛేంజర్‌’ ఆడియో లీక్‌.. క్రిమినల్‌ కేసు పెట్టిన దిల్‌రాజు

Published Sat, Sep 16 2023 7:02 PM

Dil Raju Files A Police Complaint On Game Changer Audio Leak - Sakshi

రామ్‌ చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌. తాజాగా ఈ సినిమా నుంచి ‘జరగండి గరగండి’అనే పాట ఆన్‌లైన్‌ వేదికగా లీకైంది.  తమన్‌ కంపోజ్‌ చేసిన ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. సాంగ్‌ లీక్‌పై నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులను సంప్రదించారు. పాటను లీకు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  చట్ట విరుద్ధంగా నాసిరకం కంటెంట్ ను వ్యాప్తి చేయొద్దు  కోరాడు. 

వందల కోట్ల బడ్జెట్‌.. ఇలా అయితే ఎలా?
ఈ మధ్య కాలంలో సినిమా బడ్జెట్‌ వందల కోట్లు దాటుతుంది. పాన్‌ ఇండియా సినిమా అయితే కచ్చితంగా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సిందే. గేమ్‌ ఛేంజర్‌ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో  తెరకెక్కుతుంది. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి కేవలం ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ పోస్టర్స్‌ మాత్రమే విడుదలయ్యాయి. ప్రమోషన్స్‌ కూడా స్టార్ట్‌ కాలేదు. అంతలోనే ఈ పాట లీకైంది. ఇది కచ్చితంగా ఇంటి దొంగల పనే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  కోట్లల్లో ఖర్చు పెట్టి తీసే సినిమాలను ఇలా లీకులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

రూ.15 కోట్ల పాట ఇదేనా?
డైరెక్టర్‌ శంకర్‌ తన సినిమాల్లోని పాటలు వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు. కేవలం పాటలకే కోట్లల్లో ఖర్చు  చేస్తుంటాడు.  గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో కూడా రూ. 15 కోట్లతో ఓ పాటను చిత్రీకరించారని ఆ మధ్య ఓ వార్త నెట్టింట బాగా వైరల్‌ అయింది.  ఆ పాట చాలా వైవిధ్యంగా ఉంటుందని, గ్రాఫిక్స్‌, లొకేషన్స్‌ అదిరిపోతాయని అన్నారు. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు ఆ పాటను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. ఇంతలోనే ఓ పాట లీకై చిత్ర యూనిట్‌కి భారీ షాక్‌ తగిలింది.  రూ. 15 కోట్ల ఖర్చుతో షూట్‌ చేసిన పాట ఇదేనని నెట్టింట టాక్‌ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతో చిత్ర యూనిట్‌ స్పందిస్తే కానీ తెలియదు. 

Advertisement
 
Advertisement
 
Advertisement