'చంద్రముఖి 2' దర్శకుడి బర్త్ డే.. గిఫ్ట్‌గా ల్యాప్‌ట్యాప్స్ | Chandramukhi 2 Director Vasu Gave Laptops Gifts His Birthday | Sakshi
Sakshi News home page

Chandramukhi 2 Vasu: డైరెక్టర్ వాసు పుట్టినరోజు.. వాళ్లకు బహుమతులు

Sep 17 2023 4:34 PM | Updated on Sep 17 2023 4:53 PM

Chandramukhi 2 Director Vasu Gave Laptops Gifts His Birthday - Sakshi

ప్రముఖ సినీ దర్శకుడు పి.వాసు శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలను చైన్నెలోని లైకా సంస్థ కార్యాలయంలో జరుపుకున్నారు. ఈయన గత 40 ఏళ్లుకు పైగా దర్శకుడిగా రాణిస్తున్నారు. వివిధ భాషల్లో 60కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈయన దర్శకత్వం వహించిన చిత్రం చంద్రముఖి –2. 

(ఇదీ చదవండి: ఐదు రోజులుగా ఆ సమస్యతో బాధపడుతున్న అనసూయ!)

రాఘవ లారెన్స్‌, బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'చంద్రముఖి 2'.. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇందులో వడివేలు, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌  భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఆర్డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 28న పాన్‌ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది. 

కాగా ఈ చిత్ర దర్శకుడు జన్మదిన వేడుకలను లైకా సంస్థ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో నటుడు రాఘవ లారెన్స్‌, లైకా సంస్థ ప్రధాన నిర్వాహకుడు జీకే ఎం తమిళ్‌ కుమరన్‌ పాల్గొని పి.వాసుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పి.వాసు తన అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి ల్యాప్‌ట్యాప్‌లని కానుకగా అందించారు. 

(ఇదీ చదవండి: రైతుబిడ్డకి వార్నింగ్.. రతిక బిహేవియర్‌పై నాగ్ సీరియస్!)

Advertisement
 
Advertisement
Advertisement