సూర్య.. 5 రూపాయల డాక్టర్? | Suriya Make Biopic 5 Rupees Doctor Life | Sakshi
Sakshi News home page

Suriya: 'జై భీమ్' కాంబో.. మరో డిఫరెంట్ సినిమా!

Jun 3 2026 2:46 PM | Updated on Jun 3 2026 2:53 PM

Suriya Make Biopic 5 Rupees Doctor Life

ఎన్నాళ్ల నుంచో థియేటర్లలో సరైన హిట్ లేక సతమతమైన సూర్యకు.. 'కరుప్పు' సినిమా కడుపు నింపేసింది. కళ్లు చెదిరే కలెక్షన్స్ సాధిస్తున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ ఆనందంలోనే సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్‌లకు రూ.30 లక్షలు విలువ చేసే తలో కారుని సూర్య ఇచ్చాడు. మరోవైపు కొత్త మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. ఇదలా ఉండగానే సూర్య చేయబోయే కొత్త ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)

గతంలో సూర్యని ప్రధాన పాత్రలో పెట్టి 'జై భీమ్' అనే సినిమా తీసిన టీజే జ్ఞానవేల్.. ఇప్పుడు మరోసారి ఇదే హీరోతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాడట. ఈసారి కూడా నిజ జీవితం ఆధారంగానే మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన డాక్టర్ తిరువేంగడం.. రూ.5 డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పేదల వైద్యుడిగా పేరు పొందిన ఈయన.. తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ నుంచి రూ.2 లేదా రూ.5 మాత్రమే తీసుకునేవారు.

ఛాతీ వైద్యుడిగా చాలా పేరు తెచ్చుకున్న ఈయనకు అద్భుతమైన జ్ఞానం ఉండేసరికి అందరూ ఈయన్ని నడిచే ఎన్‌సైక్లోపిడియా అని పిలిచేవారు. ఈయన్ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతోనూ గౌరవించింది. ఈ డాక్టర్ జీవితం ఆధారంగానే సూర్య-జ్ఞానవేల్ కొత్త మూవీ చేయబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: రూ.300 కోట్ల కలెక్షన్.. కార్లు గిఫ్ట్ ఇస్తున్న సూర్య)

(ఇదీ చదవండి: 'కేజీఎఫ్' యష్ దంపతుల రూ.24 కోట్ల డీల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement