‘‘దేశం కోసం దేనికైనా సిద్ధమైన జవాన్‌లపై ‘దీక్ష’ చిత్రంలో ఒక పాట పెట్టడం అభినందనీయం. మనం క్షేమంగా ఉన్నామంటే దానికి కారణం దేశ జవాన్లే. నిర్మాతలు తమ సినిమాల్లో జవాన్‌లను సపోర్ట్ చేస్తూ చూపించాలి’’ అని నటుడు సుమన్ తెలిపారు. కిరణ్ హీరోగా, అలేఖ్య రెడ్డి, ఆక్సా ఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దీక్ష’. డీఎస్ రెడ్డి సమర్పణలో ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో పి.అశోక్ కుమార్ నిర్మించారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ–‘‘దేశం కోసం ్ర΄ాణాలర్పించిన మురళి నాయక్‌కు ఒక ΄ాటని మా సినిమా ద్వారా అంకితం చేశాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు తుమ్మల ప్రసన్నకుమార్, డీఎస్ రెడ్డి, సి. కల్యాణ్, నటీనటులు ఆక్సా ఖాన్, మౌనిక రెడ్డి, కిరణ్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వైస్ చైర్మన్ ఎత్తరి గురురాజ్, జనరల్ సెక్రటరీ స్నిగ్ధ రెడ్డి ΄ాల్గొన్నారు.


