సూపర్‌ హిట్‌ మూవీ.. ఎవరి పారితోషికం ఎంతంటే? | Stree 2: Shraddha Kapoor, Rajkummar Rao Remuneration Details | Sakshi
Sakshi News home page

Stree 2: సెంచరీ దాటిన హారర్‌ మూవీ.. ఎక్కువ రెమ్యునరేషన్‌ ఎవరికంటే?

Aug 18 2024 12:04 PM | Updated on Aug 18 2024 12:58 PM

Stree 2: Shraddha Kapoor, Rajkummar Rao Remuneration Details

స్త్రీ .. ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. రాజ్‌కుమార్‌ రావు- శ్రద్దాకపూర్‌ల నటనకు జనాలు ఫిదా అయ్యారు. భయపెడుతూనే నవ్వించే ఈ సినిమాను చూసి ఎంజాయ్‌ చేశారు. తాజాగా దీనికి సీక్వెల్‌గా స్త్రీ 2 తెరకెక్కింది. 

ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మరోసారి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల పైచిలుకు సాధించింది. ఈ క్రమంలో ఇందులో నటించిన తారల రెమ్యునరేషన్‌ ఎంతో చూసేద్దాం..

హీరో రాజ్‌కుమార్‌ రావు రూ.6 కోట్ల పారితోషికం తీసుకోగా హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ రూ.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. కీలకపాత్రలో మెప్పించిన పంకజ్‌ త్రిపాఠి రూ.3 కోట్ల మేర రెమ్యునరేషన్‌ తీసుకున్నారట. అపరశక్తి ఖురానా.. రూ.70 లక్షలు, అభిషేక్‌ బెనర్జీ రూ.55 లక్షలు అందుకున్నారు. 

అతిథి పాత్రలో కనిపించిన వరుణ్‌ ధావన్‌.. ఏకంగా రూ.2 కోట్లు అందుకున్నాడు. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.135 కోట్లు వసూలు చేసింది.

చదవండి: బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement