ఓటీటీలో థ్రిల్లర్‌ సినిమా.. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు | Strange Darling Telugu Version OTT Streaming Now | Sakshi
Sakshi News home page

ఓటీటీలో రొమాన్స్‌ సినిమా.. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు

Jan 29 2025 10:40 AM | Updated on Jan 29 2025 11:05 AM

Strange Darling Telugu Version OTT Streaming Now

అమెరికన్‌ థ్రిల్లర్‌ సినిమా 'స్ట్రేంజ్ డార్లింగ్'(Strange Darling ) తెలుగు వర్షన్‌లో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిందని ప్రచారంలో ఉంది. కానీ, ఆ విషయాన్ని దర్శకుడు జె.టి. మోల్నర్ ధృవీకరించలేదు ఆపై తిరస్కరించలేదు. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌తో (Amazon Prime Video)  పాటు బుక్‌మైషోలో కూడా తెలుగు వర్షన్‌ రన్‌ అవుతుంది. అయితే తాజాగా  జియో సినిమా(JioCinema) ఓటీటీ ప్లాట్‍ఫామ్‌లో కూడా స్ట్రేంజ్ డార్లింగ్ మూవీ తాజాగా తెలుగు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

గతేడాది ఆగస్టు 23న విడుదలైన స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రానికి హాలీవుడ్‌లో మంచి రెస్పాన్సే వచ్చింది. ఐఎమ్‌బిడి రేంటిగ్‌ కూడా 7కు పైగా ఉండటంతో నెటిజన్లు కూడా ఆసక్తి చూపారు. కానీ,  బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా కలెక్షన్స్‌ను అయితే రాబట్టలేకపోయింది. అయితే, థ్రిల్లింగ్‌తో పాటు బోల్డ్‌ సినిమాలను ఇష్టపడే వారిని మాత్రం నిరుత్సాహపరచలేదని చెప్పవచ్చు. జె.టి. మోల్నర్ తెరకెక్కించిన ఈ మూవీలో విల్లా ఫిజ్‍గెరాల్డ్, కైల్ గాల్నెర్ ప్రధాన పాత్రలలో మెప్పించారు.

సినిమా నిడివి కేవలం 1:35 గంటలు మాత్రమే ఉంటుంది. ఇద్దరి మధ్య వన్‌ నైట్ స్టాండ్‍తో ప్రారంభమైన ఈ కథ ఫైనల్‌గా అనేక మలుపులు తిరుగుతుంది. ఫ్యామిలీతో పాటుగా కూర్చొని చూసే సినిమా ఎంతమాత్రం కాదు. అలాంటి పొరపాటైతే చేయకండని రివ్యూవర్లు కూడా చెప్పారు. స్ట్రేంజ్ డార్లింగ్ మూవీలో ది లేడీ పాత్రలో విల్లా ఫిట్‍గెరాల్డ్ నటించగా.. డెమోన్ క్యారెక్టర్‌ను గాల్నెర్ పోషించారు. 

సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో చిత్రం ఉంటుంది.  థియేటర్స్‌లో చూసేంత సినిమా అయితే కాదని చెప్పవచ్చు. కానీ, ఓటీటీలో మాత్రం పక్క చూసేయవచ్చు. చివరి 40 నిమిషాలు మరీ వైలెంట్‌గా మూవీ మారిపోతుంది. ఓటీటీలో ఔట్‌స్టాండింగ్‌ మూవీ అని చెప్పవచ్చు. ఈ వీకెండ్‌లో అమెజాన్‌, జియో సినిమాలో మీరూ చూసేయండి.

Advertisement
 
Advertisement
Advertisement