Director SS Rajamouli And Son Karthikeya Spotted At Charminar Photos Viral - Sakshi
Sakshi News home page

SS Rajamouli-Charminar: నైట్‌ బజార్‌లో రాజమౌళి సందడి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం

Apr 19 2022 11:11 AM | Updated on Apr 19 2022 12:10 PM

SS Rajamouli And Karthikeya Spotted At Charminar Photos Viral - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్‌ చార్మినార్‌లో సందడి చేశారు. కొడుకు కార్తికేయతో కలిసి అర్థరాత్రి చార్మినార్‌ను సందర్శించాడు. సాధారణ వ్య​క్తిలా వెళ్లి నైట్‌ నైట్‌ బజార్‌ అందాలను తిలకించారు. ఈ సందర్భంగా ఓ హోటల్‌లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా కొందరు వ్యక్తులు గుర్తుపట్టి రాజమౌళితో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

పాన్‌ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ అయ్యిండి కూడా ఇంత సింపుల్‌గా ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా  రంజాన్‌ మాసంలో అర్థరాత్రి దాటాక కూడా చార్మినార్‌లో షాపింగ్‌ హడావిడి కొనసాగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యంగా రంజాన్‌ మాసంలో చార్మినార్‌ వద్ద సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఇటీవలె ఆర్‌ఆర్‌ఆర్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న రాజమౌళి మహేశ్‌ బాబుతో ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement